Article Search

 కార్తీక పురాణము - పదమూడవ రోజు పారాయణము

 

విష్ణు ఉవాచ: "దూర్వాసా! బ్రాహ్మణుడవైన నీపట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై, ప్రాయోపవిష్టుడిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై వున్నాడు. నా సుదర్శనచక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఖిస్తున్నాడు. రాజయినందుకుగాను గో, బ్రాహ్మణరక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా, విప్రుడైవైన నీకు విపత్తు కలిగినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. రాజదాననీతితోనే ధర్మ పరిపాలనం చేయాలి కాని, బ్రాహ్మణుడిని మాత్రం దండించకూడదు.

Showing 1 to 1 of 1 (1 Pages)